Tv424x7
Andhrapradesh

సంగం పరిసరాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఏడు దళితులు మృతి, కొప్పాల రఘు ప్రగాఢ సంతాపం

సంగం మండలం, పెరమన సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు, ఇందుకూరుపేటకు చెందిన ఏడు నిరుపేద దళితులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనా నివేదికపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు, మాజీ జిల్లా విజిలెన్స్ మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు కొప్పాల రఘు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

రఘు ప్రభుత్వాన్ని ఇలా కోరారు:

బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించడం.

మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం.

ఘటక కారణమైన ఇసుక క్వారీ యాజమానంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం.

ఇసుక క్వారీకి సంబంధించిన అన్ని అనుమతులను రద్దు చేయడం.

కొప్పాల రఘు ఈ ప్రమాదం జిల్లాలో మరోసారి సంభవించకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఇసుక మాఫియాకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

భారతదేశంలో నిజమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న SDPI పార్టీ

TV4-24X7 News

సంతాప సభ కార్యక్రమం లో పాల్గొన్న ద్రోణంరాజు శ్రీవాత్సవ

TV4-24X7 News

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఊరుకుటి గణేష్

TV4-24X7 News

Leave a Comment