హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.
మల్లన్న మాట్లాడుతూ –“మేధావి వర్గం సూచన మేరకు… మెజారిటీ శాతం ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రత్యేక రాజకీయ పార్టీ అవసరం ఉందని నేను గ్రహించాను. ఆ ప్రజలను రాజ్యాధికార వైపు నడిపించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటిస్తున్నాను” అని స్పష్టం చేశారు.
మల్లన్న ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో బీసీ వర్గం ఆధిపత్యం కోసం కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

