నల్గొండలోని POCSO ప్రత్యేక కోర్టు రెండు కీలక కేసుల్లో కఠిన శిక్షలు విధించింది.
2013లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు మహమ్మద్ ముకర్రంకు ఉరి శిక్ష విధించింది. పది సంవత్సరాలుగా సాగిన ఈ కేసులో చివరకు న్యాయం జరిగిందని బాధితుల కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇక మరో ఘటనలో, 2021లో 16 ఏళ్ల ST బాలికపై లైంగిక దాడి చేసిన మోహమ్మద్ ఖయ్యూమ్కు కోర్టు 51 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే మొత్తం శిక్షలు కలిపి అతను 20 ఏళ్లు జైల్లో గడపాల్సి ఉంటుంది. అదనంగా రూ.7 లక్షల పరిహారం బాధితురాలికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఈ రెండు తీర్పులు బాలలపై లైంగిక దాడుల విషయంలో న్యాయస్థానాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాయో చూపిస్తున్నాయి.