ఏపి లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ పై, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్‌పై వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అయితే, సెప్టెంబర్ 11న తిరిగి సరెండర్ కావాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అంటే, మిథున్ రెడ్డి కేవలం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే తాత్కాలిక బెయిల్ పొందారు.