విజయవాడలో ఉద్రిక్తత నెలకొంది. SFI పిలుపు మేరకు విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సమయంలో విద్యార్థి సంఘ నేతలు, కార్యకర్తలతో పోలీసులు తలపడే పరిస్థితి ఏర్పడింది. నినాదాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లిన విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకొని ఈడ్చిపడేశారు.
నగరంలో ఒకపక్క విద్యార్థి సంఘాల ఆందోళన, మరోపక్క పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా వలయం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది