Tv424x7
Andhrapradesh

ఏపీ సీఎం చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న పరిమళ జ్యోతి…

కడప జిల్లా, పోరుమామిళ్ల మండలం శ్రీ అవధూత కాశి నాయన రెడ్డి కొట్టాల ఎంపియుపి పాఠశాలలో ఎస్‌.జి.టి టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న పరిమళ జ్యోతి గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.

శుక్రవారం అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ అవార్డును ఆమె స్వీకరించారు.ఈ సందర్భంగా పరిమళ జ్యోతి మాట్లాడుతూ – “రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు గర్వకారణం. ఇది నాకు మరింత ప్రేరణనిచ్చింది.

భవిష్యత్తులో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నా విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడేలా కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం ఆమెకు గర్వకారణమని, పోరుమామిళ్ల ప్రాంతానికి కూడా ఇది గౌరవమని స్థానికులు అభినందనలు తెలిపారు.

Related posts

ఆలపాటి రాజా వర్సెస్ నాదెండ్ల మనోహర్..!

TV4-24X7 News

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్…ఇదే ఆ యువ సైన్యం

TV4-24X7 News

మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు…

TV4-24X7 News

Leave a Comment