Tv424x7
Andhrapradesh

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్య నేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు.ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశా లపై చర్చించనున్నారు. సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్ఠానానికి అందించనున్నారు.అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తదితర అంశాల పైనా కేంద్రంలోని ముఖ్యు లను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలు స్తోంది. కాగా, మంగళ వారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్‌ రెడ్డి సాయంత్రానికి హైదరాబాద్‌ చేరుకోనున్నారు.కాగా కాంగ్రెస్‌ అగ్రనేత సోని యాగాంధీ.. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారు.లోక్‌సభ ఎన్నికలు మార్చి లోనే వచ్చే అవకాశం ఉండ డంతో..ఇప్పటి నుంచే ఆ ఎన్నికలపై దృష్టి సారించారు…

Related posts

సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైం రికార్డ్

TV4-24X7 News

అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ దాడులు

TV4-24X7 News

ఎమ్మెల్యే ల తలరాత రాసే జీత గాడు ఐప్యాక్

TV4-24X7 News

Leave a Comment