Congress: నేడే కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్ పూర్ లో బహిరంగ సభ..Nagpur: ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది..ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కూడా హాజరు కాబోతున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలు సైతం ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు వస్తుండటంతో ఏఐసీసీ ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది..

previous post