Tv424x7
Andhrapradesh

జీతాలు జూలై లో పెంచుతాం విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల

అమరావతి AP: అంగన్వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ‘అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మా పరిధిలోకి తెచ్చాం. ఈ సమ్మె వెనుక పొలిటికల్ అజెండా ఉంది. తెగేవరకు లాగకుండా అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మళ్లీ కోరుతున్నాం. జులైలో జీతాలు పెంచుతాం’ అని ఆయన వివరించారు. *డబ్బులు ఉన్నాయి కానీ జీతాలు ఇవ్వలేరట* అంగన్వాడీలకు ఎన్నికల తర్వాత జీతాలు పెంచుతామని మట్టి ఖర్చులు, గ్రాడ్యుటీలు పెంచుతామని జీతాలు ఐదు సంవత్సరాలు వరకు పెంచకూడదన్న నియమం ఏర్పరచు కొన్నామని అన్నారని పట్టుదలకి పోకుండా విరమించాలని స్పష్టం చేశారని, ఉద్యమం కొనసాగుతుందని అంగన్వాడి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బారావమ్మ, బేబీ రాణి, ఎన్ సి హెచ్ సుఁపజ తెలిపారు

Related posts

ఆంధ్రప్రదేశ్ : జనవరిలో కొత్త రేషన్ కార్డులు!

TV4-24X7 News

బైరెడ్డి సిద్ధార్థ్‌కు కీలక బాధ్యతలు కట్టబెడుతున్న సీఎం జగన్..!!

TV4-24X7 News

35 వార్డ్ పరిధిలో జనతా బజార్, రైతు బజార్ ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సందర్శించారు

TV4-24X7 News

Leave a Comment