Tv424x7
Andhrapradesh

చంద్రబాబు పర్యటనలో భద్రతా లోపాలు..

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా విజయవాడ కనకదుర్గ వారధిపై భద్రతాలోపాలు కనిపించాయి. అధికారులు వారధిపై లారీ అడ్డంపెట్టి విద్యుత్‌ లైట్ మరమ్మతులు చేపట్టారు..ఆయన పర్యటనపై ముందస్తు సమాచారం ఉన్నా.. వారధిపై వాహనాన్ని అడ్డంగా పెట్టడంపై తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వారధిపై ట్రాఫిక్‌ స్తంభించి చంద్రబాబు జెడ్‌ప్లస్‌ వాహన శ్రేణి దాదాపు పది నిమిషాల పాటు నిలిచిపోయింది. ఎన్‌ఎస్‌జీ కమాండోలు ట్రాఫిక్ క్లియర్‌ చేసి కాన్వాయ్‌ను ముందుకు తీసుకెళ్లారు. వంతెనపై విద్యుత్‌ పరికరాల వాహనం అడ్డుపెట్టడంపై ఎన్‌ఎస్‌జీ సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు..

Related posts

ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్

TV4-24X7 News

కాకినాడ, విజయనగరం జిల్లాల్లో కూటమి తాజా పరిస్ధితి ఏంటి ? లేటెస్ట్ సర్వే..!

TV4-24X7 News

కందుల ఆధ్వర్యంలో వీధి వర్తకులకు గొడుగులు పంపిణీ

TV4-24X7 News

Leave a Comment