Tv424x7
Andhrapradesh

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు..

..ఏపీ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా..ఈనెల 29 వరకు గడువును ఏపీ కాంగ్రెస్ కమిటీ పెంచింది. ఈ నెల 29 వరకు కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ కాంగ్రెస్ సమయం ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు 175 అసెంబ్లీ స్థానాలకు 793 దరఖాస్తులు రాగా.. 25 పార్లమెంట్‌ స్థానాలకు 105 దరఖాస్తులు వచ్చాయి..గడవు పెంచాలని నేతలు కోరడంతో మరో 20 రోజుల గడువును ఏపీసీసీ పెంచింది. దరఖాస్తులు ఎక్కువగా రావడంపై కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏ జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయంపై త్వరలో స్పష్టతనిస్తామని కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి పదిమంది ఆశావహులు పోటీపడుతున్నట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు..

Related posts

సీతo రాజు సుధాకర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా

TV4-24X7 News

ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్

TV4-24X7 News

వివేకా మర్డర్ కేసు : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు ఖాయమేనా ?

TV4-24X7 News

Leave a Comment