తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు..తొలిసారి ఏపీ వేదికగా రేవంత్‌రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ఈ రోజు విశాఖలో పర్యటించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ – వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.. సాయంత్రం స్టీల్‌ప్లాంట్ గ్రౌండ్స్ లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.. ఈ సభావేదికగా సేవ్ వైజాగ్ – సేవ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు..

next post