కడప, జూలై 29: చాపాడు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జే. రామసుబ్బారెడ్డికి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)గా పదోన్నతి లభించింది.
1993 బ్యాచ్‌కు చెందిన ఆయన కడప జిల్లాలోని చిన్నచౌక్, ఖాజీపేట, చాపాడు తదితర పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసినందుకు ఈ పదోన్నతి లభించినట్లు సహచరులు తెలిపారు.
పదోన్నతి అనంతరం ఆయనను చాపాడు పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ చేసి, మైదుకూరు కోర్టు మానిటరింగ్ విభాగం ద్వారా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు నియమించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: