ఎంత సంపాదించాను అనేది ముఖ్యం కాదు…పది మంది కి సహాయ పడ్డమా లేదా అనేదే ముఖ్యం….. కొమరోలు మండలం నరసింహుని పల్లె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య కుటుంబం వాళ్లు ఆనాథలుగా ఉన్నారు వారికి పిల్లలు లేనందువలన వయసులో ఉన్నప్పుడు పని చేసుకుని వారి జీవనం సాగించేవారు కానీ ఇప్పుడు పనిచే సే వయసు లేదు ఎవరైనా సహాయం చేస్తే రోజువారి పూట గడుస్తుంది సహాయం చేసే వారి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.ఈ విషయాన్నీ ఫ్రెండ్స్ సేవ సంస్థ సభ్యుడు బత్తుల కేశవ ఫ్రెండ్స్ సేవా సంస్థ దృష్టికి తేవటం జరిగింది. ఈ సహాయ కార్యక్రమానికి ఆలం వినోద్ కుమార్ (దేవనగరం), జాజం నారాయణా (కొమరొలు), అనిగాని శివయ్య (జాతివర్తి పల్లె) వీరి సహకారం తొ 25 కేజీ లు బియ్యం, మరియు ఒక నెలకు సరిపడు నిత్యా అవసర సరుకులు ఇవ్వడం జరిగింది .ఈ సహాయ కార్యక్రమానికి సహాయ పడిన దాతలకు వెంకట సుబ్బయ్య కుటుంబం తరుఫున మరియు ఫ్రెండ్స్ సేవ సంస్థ సభ్యులు అందరి తరుఫున మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు.

previous post