Tv424x7
Andhrapradesh

మృతి చెందిన టీడీపీ నేతలకు ఘననివాళులర్పించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, కోడూరు, 31.05.2024.మైలవరం తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ మహాకూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు శుక్రవారం జి.కొండూరు మండలంలోని కోడూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మృతి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల పార్థివ దేహాలను సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జి.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచి బెజవాడ సుబ్బారావు (75) గారు శుక్రవారం మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు బెజవాడ వెంకటప్పయ్య (75) గారు కూడా శుక్రవారం మృతి చెందారు. వీరిద్దరి పార్థివ దేహాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదే గ్రామానికి చెందిన గోళ్ల సాయి (24) అనే యువకుడు కూడా విజయవాడ రూరల్ మండలంలోని నున్న గ్రామంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. సాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయి కుటుంబ సభ్యుల్ని కూడా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు పరామర్శించారు. మృతి చెందిన వారందరి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, మహాకూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజయవాడ వాలంటరీ సదస్సుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు హౌస్ అరెస్ట్

TV4-24X7 News

సీతం రాజు సుధాకర్ కి వినతి పత్రం అందజేస్తున్న విల్లురి

TV4-24X7 News

శ్రీశైల గిరులు.. పర్యాటక సిరులు..!!

TV4-24X7 News

Leave a Comment