Tv424x7
Telangana

ఉద్యోగులు స‌మ‌యానికి రాకుంటే చ‌ర్య‌లే :మంత్రి తుమ్మ‌ల వార్నింగ్

హైద‌రాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై మంత్రు లు ప్రత్యేక దృష్టి సారించ నున్నట్లు తెలుస్తుంది.వివిధ శాఖల్లో తనిఖీలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేప‌థ్యంలోఈరోజు ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాల యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. నిర్ధేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. అలాగే కార్యాలయంలో ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని ఉన్నతా ధికారులను మంత్రి ఆదేశిం చారు. ఇక నుంచి ఆకస్మిక తనిఖీ లు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల హెచ్చరించారు. సమయ పాలన లేకుండా ఉద్యోగులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాగే జరిగితే ఉద్యోగులపై చర్యలు తప్పవని మండిపడ్డారు…

Related posts

రాజ్యసభ ఎంపీగా ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవం.. వారికి కృతజ్ఞతలు..!!

TV4-24X7 News

తెలంగాణాలో లక్ష బెల్ట్ షాపులు క్లోజ్

TV4-24X7 News

నేటితో ముగియనున్న వైస్ ఛాన్సలర్స్ పదవి కాలం

TV4-24X7 News

Leave a Comment