Tv424x7
Andhrapradesh

గంజాయి పట్టించిన వారికి బంపర్ ఆఫర్

అమరావతి:గంజాయి, డ్రగ్స్ నియంత్ర ణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ ఈరోజు సమావేశం అయింది. సమావేశంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గిరిజనులను ప్రలోభాలకు గురిచేసి గంజాయి సాగు చేయిస్తున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కరోనా సమయం లో రెండేళ్ల పాటు గంజాయి పై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి గంజాయి పట్టించిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటిం చారు.మంత్రి అనిత. ఈసందర్బంగా గంజాయి సరఫరాకి అమాయక గిరిజనులను బలిచేస్తున్నా రని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గతంలో 16 రకాల పంటలు పండించేవారన్నారు. గత ఐదేళ్లుగా పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దాని కారణంగా డబ్బు కోసం గంజాయి అమ్ముతూ గిరిజనులు పట్టుబడుతు న్నారని చెప్పారు. ప్రభు త్వం ఇచ్చిన భూమిలో గంజాయి సాగు చేయవద్దని మంత్రి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు…

Related posts

18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

TV4-24X7 News

ప్రొద్దుటూరుఎమ్మెల్యే పై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కామెంట్స్

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అప్రమత్తంగా ఉండాలి

TV4-24X7 News

Leave a Comment