Tv424x7
Andhrapradesh

ట్రిపుల్ ఐటీల్లో ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

ఏలూరు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేసిన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అధికారులు.ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయి,67.15 శాతం ఎంపిక.నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీల్లో 2024-25 అడ్మిషన్స్‌కు 4,400 సీట్ల భర్తీకి అన్ లైన్‌లో నమోదు చేసుకున్న 53,863 మంది విద్యార్థులు.ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అధిక స్థాయిలో ఉత్సాహం కనబరచిన విద్యార్థులు.ట్రిపుల్ ఐటీ విద్యాభ్యాసంకు 93శాతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికవ్వగా, 7శాతం ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు దక్కింది.రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 498 సీట్లు సాధించిన శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా 286 సీట్లు.జులై 22 నుండి 27 వరకు ఎంపికైన విద్యార్థులకు కౌన్సిలింగ్, ఆగస్టు నెలలో తరగతులు ప్రారంభం.ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆర్జియుకేటి వెబ్‌సైట్‌లో పెట్టి, కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు కాల్ లెటర్స్, మెసేజ్స్ పంపనున్న యూనివర్సిటీ అధికారులు.

Related posts

ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ..

TV4-24X7 News

ఎన్టీఆర్ 101వ జయంతి నివాళులు అర్పించిన తారక్ కళ్యాణ్ రామ్

TV4-24X7 News

35వ వార్డు ప్రాంతంలో పర్యటన

TV4-24X7 News

Leave a Comment