జమ్మూకశ్మీర్‌లో 30ఏళ్లకు తెరచుకున్న ఆలయం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉమా భగవతి అమ్మవారి ఆలయం మూడు దశాబ్ధాల తర్వాత తెరచుకుంది. 1990లో కూల్చివేసిన ఈ ఆలయాన్ని పునరుద్ధరణ అనంతరం భక్తుల కోసం తెరిచారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన అమ్మవారి విగ్రహాన్ని ఆదివారం గర్భగుడిలో ప్రతిష్ఠాపన చేశారు. అనంతరం కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ సమక్షంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని పునరుద్ధరించటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

previous post
next post