విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ జగన్నాధస్వామి వారి రధోత్సవం విశాఖ దక్షిణ నియోజకవర్గం వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగేయి. విశాఖపట్నం, చుట్టుపక్కల జిల్లా నుంచి వచ్చిన భక్తులు ఉత్సవం నిర్వాహణ తీరును, ఉత్సవ నిర్వాహకులను ఎన్నో విధాలుగా మెచ్చుకున్నారు.దీనంతటకి కారణమైన, మమ్మల్ని ఉత్సవ కమిటి సభ్యులుగా నియమించిన నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ని కమిటీ సభ్యుల అందరం కలిసి సత్కరించుకోవడం చాలా అనందంగా వుంది.ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ జగన్నాధస్వామి రధోత్సవ కమిటీ సభ్యులు డోల హరీష్(మున్నా) కె.ఈశ్వరమ్మ , ఎస్. రామకృష్ణ , పి.శ్రీధర్ , జె.పరశురాం , ఆర్.వెంకటేష్ , కె. మణికుమార్ , యు.ఆదిలక్ష్మి , జి.సుశీల , మరియు 36 వ వార్డ్ జనసేన అధ్యక్షులు పి. శ్రీనివాస్ అలాగే 36 వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు కే. గణపతి పాల్గొన్నారు.
