Tv424x7
Andhrapradesh

అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు : డి.ఎస్.పి రవికుమార్

ఆళ్లగడ్డ తాలూకాఅసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని రౌడీ షీటర్ లను ఉద్దేశించి ఆళ్లగడ్డ తాలూకా డి.ఎస్.పి రవికుమార్ పేర్కొన్నారు.ఆదివారం నంద్యాల జిల్లా,సిరివెళ్ల మండలపోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆళ్లగడ్డ తాలూకా డి.ఎస్.పి రవికుమార్,సీఐ వంశీధర్,ఎస్సై బి.చిన్న పేరయ్య ఆధ్వర్యంలో రౌడీ షీటర్ లకు కౌన్సిలింగ్ చేశారు.ఈ సందర్బంగా డి.ఎస్.పి రవికుమార్ మాట్లాడుతూ సమాజంలో ప్రతిమనిషి గౌరవప్రదంగా జీవించాలని చెప్పారు.కొంతమంది చెడు వ్యాసనాలకు గురై సమాజంలో అసాంఘీక శక్తులుగా మారి ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరైందికాదన్నారు.కొందరు చేసే తప్పులకు కుటుంబాలు నష్టపోతున్నాయని ఆవేదన చెందారు. కావున భవిష్యత్ లో ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడకుండా సంతోషంగా జీవనం సాగించాలని, లేనిపక్షంలో కఠినచర్యలు చేపడతామని డిఎస్పీ హెచ్చరించారు

Related posts

ప్రియాంక విద్యోదయ స్కూల్ నందు రెండవ ఈస్ట్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం .శ్రీను ట్రాఫిక్ నియమాలు అవగాహన సదస్సు

TV4-24X7 News

తొలి దళిత ముఖ్యమంత్రివర్యులు దామోదర్ సంజీవయ్య 103వ జయంతి

TV4-24X7 News

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మరమ్మతులకు నోచని వాహనాలు…

TV4-24X7 News

Leave a Comment