Tv424x7
Andhrapradesh

మిస్సింగ్ కేసును ఛేదించిన వన్ టౌన్ పోలీసులు

విశాఖ దక్షిణం మిస్సింగ్ కేసును వన్ టౌన్ పోలీసులు చేదించారు. వన్ టౌన్ పరిది ఘోష హాస్పిటల్ దగ్గర వున్న, కంచర వీధికి చెందిన, బొల్లపు విధ్యా సాగర్ (35) ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ నందు సూపర్వైజర్ గా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన అవసారాలకు కొంత మంది దగ్గర డబ్బులు తప్పుతీసుకొని అనుకొన్న సమయానికి డబ్బులు ఇవ్వలేక ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురి అయి ఏమి చేయాలో తోచక ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఈ నెల 17 రాత్రి విజయవాడకు వెళ్ళిపోయాడు. అక్కడ మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్టు తెలుసుక్కున్న కుటుంబ సభ్యులు విజయవాడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వెతగ్గ ఎక్కడా కనిపించకపోయేసరికి విశాఖ ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కింద కంప్లయింట్ ఇచ్చారు. వన్ పోలీస్ స్టేషన్ సి ఐ., భాస్కర్ రావు పర్యవేక్షణలో  కేసు దర్యాప్తులో భాగంగా ఎస్. ఐ., లక్ష్మణ రావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసు రావు సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాసాగర్ విజయవాడ రైల్వే స్టేషన్ లో వున్నట్టు గుర్తించి ఆయన్ను తీసుకొని వచ్చారు.వన్ స్టేషన్ కి కుటుంబసభ్యులను పిలిపించి.. కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం జరిగింది. పోలీస్ సిబ్బందికి విద్యాసాగర్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియపరిచారు. మిస్సింగ్ కేసును ఛేదించిన వన్ టౌన్ సి. ఐ భాస్కర్ రావు ను ఎస్. ఐ. లక్ష్మణ్ రావు ను, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను ఉన్నత అధికారులు అభినందించారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ – 2024

TV4-24X7 News

చంద్రుడి పై నాసా భారీ ప్లానింగ్ ఏంటో తెలుస్తే షాక్

TV4-24X7 News

అయ్యప్పలకు అన్నసమారాధన

TV4-24X7 News

Leave a Comment