ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ గురువారం ఉదయం భేటీ అయ్యారు. విజయవాడ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి రాజకీయపరమైన అంశాలపై కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ ప్రజల గురించే నిత్యం పరితపించే జగనన్న మళ్లీ నూతన ఉత్సాహంతో కనిపించారన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్లో మంచి రోజులు వస్తాయని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆధ్యాత్మిక ఆరోపణ లు దురదృష్టకరమన్నారు. వైసిపి చేసిన మంచిని ప్రజలెవరూ మర్చిపోలేదని, తాను ఎక్కడికి వెళ్ళినా జగనన్న అందించిన సంక్షేమం, మంచి పాలనపై ప్రజలు ఇప్పటికీ తనపై ఆధరణ చూపిస్తున్నారన్నారు.
