Tv424x7
Andhrapradesh

సతీష్ కుటుంబానికి అండగా ఉంటాం

పదివేలు ఆర్థిక సాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

విశాఖపట్నం తోటి మనుషులకు సాయం చేస్తూ గుండెపోటుతో ప్రాణం విడిచిన తమ వైసిపి కార్యకర్త, కురుపాం మార్కెట్ మాజీ ట్రస్ట్ సభ్యుడు పోలవరపు సతీష్ కుటుంబానికి అండగా ఉంటామని దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. 39 వ వార్డు కోటవీధి కన్వేర్ బెల్ట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆ కుటుంబాన్ని వాసుపల్లి గణేష్ కుమార్ మంగళవారం ఉదయం పరామర్శించి రూ. పది వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ట్రస్టు సభ్యుడిగా ఎంతో మందికి సాయం చేస్తూ, తోటి వారికి ఆదర్శంగా నిలిచాడన్నారు. అలాగే వైసిపి సిన్సియర్ కార్యకర్తగా సేవలందించి సచివాలయం కన్వీనర్ గా, పార్టీలో వివిధ హోదాల్లో నిజాయితీగా పని చేసి ప్రజలకు సేవలు అందించారన్నారు. అటువంటి మంచి వ్యక్తి పోలవరపు సతీష్ ఇతరులకు అప్పులకు సూరిటీగా ఉండి ఆర్థిక ఇబ్బందులు తాళ్ల లేక గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు. ఆ కుటుంబానికే కాకుండా పార్టీకి తీరని లోటు అని వాసుపల్లి గణేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి సతీష్ కుమార్తె క్యాంపస్ ఇంటర్వ్యూ కి వెళ్లే టూరు ఖర్చులు, అలాగే తన వివాహ వేడుకలకు కూడా ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలుస్తానని వాసుపల్లి గణేష్ కుమార్ భరోసా కల్పించారు. పేదల పెన్నిధి, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సేవే పరమావధిగా నిస్వార్ధంగా పనిచేసే వాసుపల్లి గణేష్ కుమార్ చేస్తున్న ఆర్థిక సాయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ ట్రస్ట్ చైర్మన్ కొల్లి సింహాచలం, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్, వైసిపి శ్రేణులు బాబ్జి, కృష్ణ, సలీం, రాజేష్ మాధురి, రమణమ్మ, ధనరాజు ఆది తదితరులు పాల్గొన్నారు.

Related posts

సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ సమయం మార్పు..!

TV4-24X7 News

లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ల ఇన్ స్పెక్షన్ చేపడుతున్న సందర్భంగా 3వ పట్టణ పోలీసు స్టేషన్ ను సందర్శించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి

TV4-24X7 News

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

TV4-24X7 News

Leave a Comment