Tv424x7
National

పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!

💥 పోస్టుమార్టానికి వైద్యుల ఏర్పాట్లు.. బతికే ఉన్నానంటూ యువకుడి కేకలు!💥

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటనరోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడుచికిత్స పొందుతూ మృతి చెందినట్టు వైద్యుల ప్రకటనపోస్టుమార్టం కోసం స్ట్రెచర్‌పై తీసుకెళ్తుండగా కదలికఆపై బతికే ఉన్నానంటూ కేకలువిచారణకు ఆదేశించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చనిపోయాడని భావించిన వైద్యులు పోస్టుమార్టంకు సిద్ధపడగా అతడి కేకలతో ఉలిక్కిపడ్డారు. మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ మెడికల్ కాలేజీలో జరిగిందీ ఘటన. గోట్కా గ్రామానికి చెందిన షగుణ్‌శర్మ బుధవారం రాత్రి తన సోదరుడితో కలిసి బైక్‌పై ఖతౌలీ వైపు వెళ్తుండగా ఓ వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.షగుణ్‌శర్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మీరట్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఏర్పాట్లు చేశారు. స్ట్రెచర్‌పై మార్చురీకి తరలిస్తున్న సమయంలో ‘సార్.. నేను బతికే ఉన్నా’ అని షగుణ్ కేక వేయడంతో వైద్యులు షాకయ్యారు. వెంటనే అతడిని మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. కాగా, ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ విచారణకు ఆదేశించారు.

Related posts

ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు

TV4-24X7 News

బీజేపీ గెలిచే సీట్లపై ప్రశాంత్‌ కిషోర్‌ కీలక వ్యాఖ్యలు

TV4-24X7 News

ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం

TV4-24X7 News

Leave a Comment