అమరావతి: బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు సూపర్ సిక్స్ పథకాలపై ఎన్డీయే ఎమ్మెల్యేలకు కూటమి ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది..నేడు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వేదికగా పీఆర్‌ఎస్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని 164 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే సమాచారం అందించారు. రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉంది? ఏయే అంశాలపై సభలో చర్చించాలి?బడ్జెట్‌పై ప్రసంగం ఎలా చేయాలి? అన్న దానిపై శిక్షణ ఇస్తారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారు. ఆ తర్వాత రెండు గంటలకు ఎన్డీయేఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలకు పలు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు..

previous post