విశాఖపట్నం మహనీయుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థులు అలవరుచుకోవాలనివిశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు,32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు.మంచి భవిష్యత్తుకు పునాది వేసేలా బాల్యం ఉండాలని పేర్కొన్నారు. భారత తొలి ప్రధానిపండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని గురువారం 32వ వార్డు భీమ్ నగర్ అంగన్వాడీలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులుదేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మంచి లక్ష్యాలతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి ఎందరో మహనీయుల త్యాగాలను పిల్లలకు వివరించారు. ప్రపంచంలోనే ఉత్తమ శక్తిగా ఎదిగే అవకాశం మన దేశానికే ఉందని అన్నారు. అన్నిరంగాల్లో దేశ పురోగాభివృద్ధిలో బాలలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఎంతో ఉన్నత స్థాయికి చేరాలని చెప్పారు.నేటి బాలలే రేపటి పౌరులని అన్నారు.ఈ కార్యక్రమంలో కుమారి,శాలివాహన,బుజ్జి(సిపిఐ),అదిబాబు,రాజు, ప్రసాదు, దుర్గాప్రసాద్, కందుల బద్రీనాధ్, కందుల కేదార్నాథ్,అంగన్వాడి టీచర్ పర్వన్ సుల్తాన్ అంగన్వాడి ఆయా బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు.

previous post
next post