విశాఖపట్నం కంచరపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం మతి స్థిమితం లేని యువతి రోడ్డు పై దిక్కుతోచని స్థితిలో పడుకొని ఉండటం గమనించి, తన వివరాలు అడిగి, మానసిక సంరక్షణ గృహంలో చేర్పించి, తన తల్లితండ్రుల చెంతకు చేరుస్తామని భరోసా కల్పించారు. అందులో బాగంగా సదరు యువతి తల్లితండ్రుల ఆచూకీ కనుగొని, వారిని బీహార్ నుంచి రప్పించి ఈ రోజు క్షేమంగా వారికి అప్పగించడమైనది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కంచరపాలెం పోలీసులను అభినందించారు.
