ఏపీలోని అనకాపల్లిలోని పరవాడ మండలం, భరణికం గ్రామంలో డయేరియా విజృంభిస్తోంది. తాజాగా డయేరియా బాధితుల సంఖ్య 15కు చేరుకుంది. ప్రస్తుతానికి ఇద్దరు, ముగ్గురు స్వల్పంగా కోలుకున్నారు. పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో 11 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరో ఇద్దరిని స్థానికంగా ఉన్న కేర్ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాలో డయేరియా కేసుల సంఖ్యల పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వణికి పోతున్నారు.
