మహిళలకు చీరల పంపిణీ
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు పీతల వాసు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ సౌత్ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఆశీల మెట్ట కార్యాలయంలో గురువారం కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పీతల వాసుకి సాలువా కప్పి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించారు. కేక్ కటింగ్ అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో సౌత్ సోషల్ మీడియా అధ్యక్షుడు బెవర మహేష్, వైసీపీ సీనియర్ నాయకులు బొండాడ వెంకటరావు, కొండ్రు సతీష్, ఉరుకుటి శివ పండు, రాష్ట్ర మాజీ కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ సన్పల రవీంద్ర భరత్, బీసెట్టి ప్రసాద్, శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త కంటుముచ్చు సాగర్, తాడి రవితేజ, బైబోడి శివకుమార్, గొర్రెపాటి శివ, పీతల సాయి, గొలగాని మధు, ముగడ రాజేష్, లీల రాజు, పీతల ఉమా మహేష్, గండి వలస పెంటయ్య, వెంకటలక్ష్మి, చింతకాయల వాసు, చేపల రాజు తదితరులు పాల్గొన్నారు.