Tv424x7
Andhrapradesh

తొక్కిసలాటలో శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల మృతిపై మాజీ సీఎం వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి

తాడేపల్లి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనంకోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.

Related posts

మారుతున్న విశాఖ నగర మేయర్ పీఠం

TV4-24X7 News

ప్రధాని నివాసానికి బయలుదేరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి చోటు దక్కింది. పీఎంవో నుంచి సాయంత్రం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటూ ఇద్దరి నేతలకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఢిల్లీలోని కిషన్‌రెడ్డి నివాసం నుంచి బండి సంజయ్‌ ఒకే కారులో ప్రధాని నివాసానికి బయలుదేరారు. ముందుగా అక్కడ జరిగే తేనేటి విందుకు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు.

TV4-24X7 News

అంత్యక్రియలకు కందుల ఆర్థిక సహాయం

TV4-24X7 News

Leave a Comment