హైదరాబాద్: పండుగకు పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చే ప్రయాణి కులు అధికంగా ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని పండుగ ముందు రోజుల్లో హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు వచ్చే బస్సుల సంఖ్యను పెంచారు. ఆర్టీసీ అధికారులు,ఉమ్మడి జిల్లా లో ఏడు డిపోల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపను న్నారు. దిల్‌సుఖ్‌నగర్, ఎల్.బీ నగర్, ఉప్పల్, సాగర్ రింగురోడ్డు ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సులను ఆపరేట్ చేయనున్నారు. రీజనల్ మేనేజర్ ఆధ్వర్యం లో డిపో మేనేజర్లు, ఇతర సిబ్బంది వీటిని పర్యవేక్షించ నున్నారు. ఈరోజు నుంచి 13వ తేదీ వరకు, ఆ తరువాత తిరిగి 15 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడు స్తాయి. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 400 ప్రత్యేక బస్సులు నడిపేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజధాని, సరిహద్దు జిల్లాలకు ఈ బస్సులు నడవనున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసా రి సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సుల సంఖ్యను ఆర్టీసీ అధికారులు పెంచారు. దసరా పండుగ సందర్భంలో మాత్రమే ప్రత్యేక బస్సులు నడిపే ఆర్టీసీ ఈసారి సంక్రాంతి పండుగకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది.రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల కు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక బస్సులను పెద్ద సంఖ్యలో నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రయాణికులకు సౌకర్యంతో పాటు ఆర్టీసీకి అధిక లాభా లు సమకూర్చేందుకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నాయి. రాష్ట్ర రాజధానితో పాటు ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాలు, మండలాలు, గ్రామాలకు పండుగ సందర్భంగా ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యా సంస్థలకు సెలవులు వస్తున్న నేపథ్యం తో పాటు పల్లెవెలుగులు, ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం దృష్ట్యా రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. ఆయా డిపోల పరిధిలో ఎన్ని బస్సులు నడిపించా లనే దానిపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు.

previous post
next post