టీజీ : మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు MLCలకు చోటు కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. CM రేవంత్ తాజా ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 4 ఎమ్మెల్యేలకు, 2 ఎమ్మెల్సీలకు కేటాయించనున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్కు అత్యంత నమ్మకమైన వరంగల్ నేతకు, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు ఈ అవకాశం దక్కొచ్చని సమాచారం.
