కడప/మైదుకూరు మున్సిపాలిటీ విజయ్ థియేటర్ ,అంకాలమ్మ గుడి మీదుగా వెళ్లే విజయవాడ హైవే రోడ్డును సంవత్సరాల తరబడి బాగు చేయరా ప్రజల వాహనదారుల ఇబ్బందులను పట్టించుకోరా అంటూ సిపిఎం మైదుకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో రోడ్డుపైన నిలిచిపోయిన నీటిలో వరి నాటు నాటుతు వినూత్న నీరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఎస్,ఎం షరీఫ్ మాట్లాడుతూ… రాయలసీమ లోని నడిబొడ్డున ఉన్నటువంటి మైదుకూరు మున్సిపాలిటీ విజయ థియేటర్ దగ్గర నుండి కూరగాయల మార్కెట్ వరకు హైవే రోడ్డు మీద 365 రోజులు నీరు నిల్వ ఉంటుందని దీని మరమ్మత్తును ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని వారు విమర్శించారు, నిత్యం పోరుమామిళ్ళ, గిద్దలూరు, మార్కాపురం, శ్రీశైలం, విజయవాడ ప్రాంతాలకు వందలాది వాహనాలు రాకపోకలు కలిగించే ప్రధాన రోడ్డు, శాంతినగర్, సుందరయ్య నగర్, ఇందిరమ్మ కాలనీ, వెంకటసుబ్బయ్య కాలనీ, ఇతర మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలో ప్రజలు, తిరిగేటువంటి ప్రధాన రహదారి అయిన ఈ రోడ్డు సంవత్సరం పొడుగునా చెరువులు తలపిస్తుందని, అటు ఆర్ అండ్ బి అధికారులు కానీ ఇటు హైవే అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ, ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదని నిత్యం వేలది మంది తిరిగే ఈ రోడ్డు దాదాపు 30 అడుగుల వెడల్పున 300 అడుగుల పొడవుతో నీరు నిల్వ ఉండటం వలన పాదచారులు, సైకిల్ మీద వెళ్ళేటువంటి వారు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఇక్కడే కూరగాయల మార్కెట్,. అంకాలమ్మ గుడి, స్మశానం ఉన్నందున ఇక్కడికి వచ్చే రైతులు, భక్తులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కళ్ళముందే ఇంత కనిపిస్తున్న ఏ ఒక్క అధికారి కూడా దీనిని పట్టించుకోకపోవడం దుర్మార్గమని వారి విమర్శించారు, పొద్దున లేస్తే అభివృద్ధి పేరు చెప్పే అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే వారంలో మూడు రోజులు ఇదే రోడ్డుపై వెళ్తుంటాడని మైదుకూరు పట్టణంలో ఈ రోడ్డు ఆయనకు కనిపించలేదా అని వారన్నారు. తక్షణం సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని నీరు నిలవ ఉండకుండా ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత అధికారులదని, ఇప్పటికైనా అధికారులు స్పందించని పక్షంలో ఆందోళన పోరాటాలు తీవ్రతరం చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గురవయ్య, గండి సునీల్ కుమార్, రవి, శేఖర్, లక్ష్మయ్య, సుధాకర్, పోలయ్య, వెంకటేష్, హరి, జహంగీర్, భాష తదితరులు పాల్గొన్నారు,
