Tv424x7
Andhrapradesh

స్కూల్‌ విద్యార్ధులకు మంత్రి లోకేశ్‌ తీపికబురు.. ఇక ప్రతి శనివారం పండగే!*

AP School: అమరావతి, మార్చి 23: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూటమి సర్కార్‌ గుడ్‌న్యూ్‌స్ చెప్పింది. ప్రస్తుతం అన్ని పాఠశాలల విద్యార్థులకు ప్రతి నెల మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇకపై దీనిని ప్రతి శనివారం దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం నో బ్యాగ్ డేను అమలు చేయనున్నారు. విద్యార్ధుల సమగ్ర వికాసమే లక్ష్యంగా కీలక చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర విద్యాశాఖ తాజాగా నో బ్యాగ్‌ డే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తున్న నో బ్యాగ్ వల్ల ప్రతి శనివారం విద్యార్థులకు పాఠాలకు బదులు.. క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని లోకేశ్‌ తెలిపారు.నో బ్యాగ్ డే వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోనాలపై వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలిపిన విశేషాలతో కూడిన వీడియోను కూడా మంత్రి లోకేష్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.రేపటితో ముగుస్తున్న సీయూఈటీ (యూజీ) 2025 దరఖాస్తు గడువుకామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్‌(సీయూఈటీ-2025) యూజీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును మరోమారు పొడిగిస్తూ ఎన్‌టీఏ ప్రకటన జారీ చేసింది. మొదట ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మార్చి 22 ప్రకటించగా.. ఆపై అభ్యర్థుల వినతుల మేరకు ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ గడువును మార్చి 24 వరకు పొడింగించినట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఈ మేరకు అభ్యర్థులు తుది గడువు ముగింపులోగా దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ సూచించింది. ఇక సీయూఈటీ (యూజీ) 2025 రాత పరీక్షలు మే 8వ తేదీ నుంచి 2025 జూన్‌ 01 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

Related posts

వైసీపీ నేత పేర్ని నానికి బిగ్ షాక్.. క్రిమినల్ చర్యలకు సిద్దమవుతున్న సర్కార్

TV4-24X7 News

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి- పక్కా గృహాలను వెంటనే పూర్తి చేయాలి- మండల ప్రత్యేక అధికారి మైకేల్ రాజీవ్

TV4-24X7 News

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

TV4-24X7 News

Leave a Comment