రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు లగేజి తీసుకువెళ్తున్నారా??? ఐతే రైలులో ప్రయాణించే ముందు ఇది తెలుసుకోండి!
రైల్వే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే శాఖ లగేజీ పరిమితులను నిర్దేశించింది. ప్రయాణ తరగతిని బట్టి లగేజీ బరువు పై రుసుము వసూలు చేస్తారు. ఒక్కరి దగ్గర AC ఫస్ట్ క్లాస్ లో 70 కేజీలు, AC 2టైర్లో 50కేజీలు, AC 3టైర్ మరియు స్లీపర్లో 40కేజీలు, జనరల్ బోగీలో 35 కేజీల బరువు కంటే మించకూడదు. ఈ పరిమితిని మించి తీసుకెళ్లాలనుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.