Tv424x7
Andhrapradesh

పవన్ తో జగన్ కి పోలిక ఏంటీ..పవన్ కి అంత సీన్ లేదు: ఉండవల్లి

డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎంపికైన తర్వాత ఆయన ఇప్పటివరకు ఏమీ ఉద్ధరించలేదని నా అభిప్రాయం అంటూ ఉండవల్లి

ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎంతోమంది అభిమానులు జగన్ వర్సెస్ పవన్ అనే విధంగా వ్యత్యాసాలను గమనిస్తూ వస్తున్నారు..పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన 100% విజయంతో అధికారంలోకి వచ్చారు అంటూ జన సైనికులు భావిస్తున్నారు ఇలా సోషల్ మీడియాలో కూడా పవన్ వర్సెస్ జగన్ అనే విధంగా అభిమానుల మధ్య యుద్ధం కొనసాగుతుంది.ఈ క్రమంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనకు ఇదే ప్రశ్న ఎదురయింది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ మాట్లాడారు. ఈ క్రమంలోనే వీరిద్దరిలో మీ దృష్టిలో ఎవరు ఎక్కువ అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఉండవల్లి సమాధానం చెబుతూ…పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం గా ఎంపికయ్యారు. అయితే ఆయన సొంతంగా ఏమి ఆ స్థానానికి చేరుకోలేదు అంటూ ఉండవల్లి తెలిపారు. ఆయన చంద్రబాబు నాయుడు సపోర్టుతో డిప్యూటీ సీఎం అయ్యారు అయితే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ అనే విధంగానే పోలికలు ఉంటాయి తప్ప పవన్ కళ్యాణ్ తో జగన్ కి పోలికే లేదని తెలిపారు. పోటీ అనేది చంద్రబాబు నాయుడు జగన్ మధ్య ఉంటుంది తప్ప మూడో పార్టీ వచ్చే అవకాశం లేదని తెలిపారు.చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరికీ ఓటు బ్యాంక్ ఫిక్స్ అయింది. ఇద్దరికీ ఒక రెండు మూడు శాతం అటూ ఇటూ ఉండవచ్చు 2019లో చంద్రబాబుకు ఎంత శాతం అయితే ఓటు షేర్ వచ్చిందో 2024 లో జగన్మోహన్ రెడ్డికి అంతే వచ్చిందని తెలిపారు.. ఇక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎంపికైన తర్వాత ఆయన ఇప్పటివరకు ఏమీ ఉద్ధరించలేదని నా అభిప్రాయం అంటూ ఉండవల్లి తెలిపారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గురించి ఉండవల్లి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related posts

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అప్రమత్తంగా ఉండాలి

TV4-24X7 News

నేటితో 69వ వసంతంలోకి ఆధునిక దేవాలయం.. నాగార్జుసాగర్ డ్యాం

TV4-24X7 News

సీతం రాజు సుధాకర్ కి వినతి పత్రం అందజేస్తున్న విల్లురి

TV4-24X7 News

Leave a Comment