Tv424x7
Andhrapradesh

మాజీమంత్రి విడుదల రజనికి జైలు శిక్షా.?

అమరావతి :విజిలెన్స్ తనిఖీల పేరుతో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి సొమ్ము వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడదల రజిని, తదితరుల పై పదేళ్ల వరకు జైలుశిక్షకు వీలున్న ఐపీసీ సెక్షన్ 386ని చేర్చినట్లు ఏజీ దమ్మాల పాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. పల్నాడు జిల్లా యడ్లపాడు లోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం రజిని, ఆమె మరిది గోపి పిటిషన్లు వేశారు.కేసు నమోదు వెనుక రాజకీయ కారణాలున్నాయిని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు. విజిలెన్స్ విచారణకు పిటిషనర్లు సహకరించారని బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తునకు అవరోధం కలగదని చెప్పారు. ఏజీ వాదనల కోసం విచారణ ఈనెల 8కి వాయిదా పడింది.2020 సెప్టెంబర్​ 4న పల్నాడు జిల్లా యడ్ల పాడు మండలం విశ్వనా థుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్‌క్రషర్‌పై దాడులు చేయకుండా, మూయించ కుండా ఉండాలంటే ఎమ్మెల్యేని కలవాలని హుకుం జారీ చేశారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని కార్యాలయానికి వెళ్లి కలిశారు.తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులి వ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారితో చెప్పారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5 కోట్లు డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత ఆరు రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్‌ విజి లెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారి – ఆర్‌వీ ఈవోగా ఉన్న ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌లో తనిఖీలకు వెళ్లి హడావుడి చేశారు.ఆ స్టోన్‌ క్రషర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే జాషువా విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్‌ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్‌ ప్రధాన కార్యాలయానికి ఈ దాడుల సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనేది అందులో లేదు. ఈ నివేదిక డీజీకీ సమర్పించలేదు. అప్పట్లో ఈ సోదాల్లో పాల్గొన్న మిగతా అధికా రులను ఏసీబీ విచారించగా జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని ఆ తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాంగ్మూలాలిచ్చారు.

Related posts

తెలంగాణలో తగ్గనున్న జిల్లాల సంఖ్య?

TV4-24X7 News

పుర్రి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన వాసుపల్లి

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించాల్సిన 20 అత్యుత్తమ పర్యాటక ప్రదేశాలు

TV4-24X7 News

Leave a Comment