కడప జిల్లా దువ్వూరు మండల పరిధిలోని చిన్నసింగనపల్లె గ్రామంలో శ్రీ పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవకొండయ్య స్వామి దేవాలయం నిర్మించి సంవత్సరం అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.మండల పరిధిలోని చిన్న సింగన పల్లె గ్రామంలో శ్రీ పోతురాజు, మల్లెలమ్మ తల్లి, సహిత భైరవ కొండయ్య స్వామి విగ్రహ ప్రతిష్ట ప్రధమ వార్షికోత్సవ మహెూత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు గ్రామ కమిటీ పెద్దలు తెలిపారు.శనివారం ఉదయం స్వామివారికి అభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పం నిర్వహించారు. వచ్చిన భక్తులందరూ స్వామివారికి దీపాధుపాలు సమర్పించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

next post