Tv424x7
Andhrapradesh

ప్రొద్దుటూరులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి

పొద్దుటూరు పాత బస్టాండ్ దగ్గర గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి రాష్ట్ర మాల మహానాడు ( రామాజీవర్గం )వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ మురళి ప్రసాద్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల చిన్న ఓబన్న మరియు జమ్మలమడుగు నియోజకవర్గ అధ్యక్షుడు సంగటి పుల్లయ్య గారు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు రామోజీ ఇమ్మానియేల్ గారు మాట్లాడుతూ గారి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67 వర్ధంతిని జరపడే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సమానత్వం కోసం పోరాడాలని అందరూ కలిసి ఉంటే రాజ్యాంగ హక్కులను కాపాడమే కాకుండా రాజ్యాధికారాన్ని సాధించుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల చిన్న ఓబన్న మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం పోరాడుతామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఎస్సీలకు కావాల్సిన హక్కులను. కాల రాస్తున్నారని గత ఏడు సంవత్సరాల నుండి రెడ్లు +కమ్మ నాయకుల పరిపాలనలోఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లను విధుల నుండి దాదాపు లక్ష కోట్ల రూపాయలను బదలాయింపు జరపడం దారుణంగా ఉంది .అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఎస్సీల కు భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేసింది .ఇంకా ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని సుప్రీంకోర్టు చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. దాని కారణంగా దోషులు స్టేషన్ బెయిల్ మీద బయటకు వస్తున్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్పనుండి. ప్రజలకు జీవో ఎం ఎస్ నెంబర్ 77 ద్వారా జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవన కన్వీనర్ కోట మినహాయించి మిగతా ఏ కోర్సులో చేరిన వారికి ఉపకార వేతనాలు ఉండవని 77 జీవో ద్వారా తెలపడం జరిగింది అదేవిధంగా గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీముతో పేదలు కూడా బాగా చదవాలని బాగుండాలని నిర్ణయంతో ఆస్కింగ్ తెస్తే ఈ ప్రభుత్వంలో ఆ బెస్ట్ స్కూల్ లను స్కీములు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా కులాంతర వివాహాల ప్రోత్సాహాలను రద్దు చేయడం జరిగినది .ఇక పోతే ఎస్సీ కార్పొరేషన్ బ్యాంకు లింకులను కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ అసైన్డ్ భూములను ఏవేవో సాకులు చెప్పి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది .ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి .మేము ఎస్సీలకు అనుకూలంగా ఉన్నాము .ఎస్సీలు వారు నా సోదరులు అని చెప్తాఉన్న ఈ ముఖ్యమంత్రి గా రు.ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీల నిధులను వారికే చెందేటట్టు చూడాలని లేనిపక్షంలో ఎస్సీలను కూడా చట్ట సభల స్థానాలకు పోటీ చేసి మా ఓటు మేమే వేకుంటాం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం అని హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో ఎం.సుధాకర్ ఇ.సుబ్రహ్మణ్యం ( అబ్బి) ఎం సత్యరాజు సి కె కుమార్ .ఏ ప్రణయ్ కుమార్. తదితరులు పాల్గొనడం జరిగినది

Related posts

మదనపల్లెలో వడ్డీ వ్యాపారి దారుణ హత్య

TV4-24X7 News

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే?

TV4-24X7 News

సూరాడ రాజు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment