యూటైల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నేషనల్ వైస్ చైర్మన్ జి. చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో డాll బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. నెల్లూరు టౌన్ VRC సెంటర్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నేషనల్ కమిటీ మెంబర్ జె. చంద్ర శేఖర్ గారు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి అందరికి మజ్జిగ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా వైస్ చైర్మన్ విజయ కుమార్, నేషనల్ కమిటీ మెంబర్ చంద్ర శేఖర్ మరియు యం. హరికృష్ణ గారు పాల్గొన్నారు. వారితో పాటుగా ఆవుల నాగేంద్ర వికలాంగుల రాష్ట్ర అధ్యక్షులు, గూడూరు వెంకటరమణయ్య VHPS జాతీయ నాయకులు దన్యాసి చిట్టి కుమార్ రాష్ట్ర కార్యదర్శి, పోలిచర్ల కిషోర్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు,పనబాక జయప్రద ( మహిళ లీడర్ ), పైడి సురేష్, పైడి రవి, సుజాత, డి. విజయ్ కుమార్ లు కూడా సంయుక్తంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

previous post