అత్తపై కోడలు గృహ హింస కేసు పెట్టొచ్చు. మరి కోడలి చేతిలో వేధింపులకు గురవుతున్న అత్త అలాంటి కేసు పెట్టొచ్చా? ఓ యూపీ మహిళ పెట్టిన కేసులో ఇదే ప్రశ్న అలహాబాద్ హైకోర్టులో ఉత్పన్నమవగా జడ్జి కీలక తీర్పునిచ్చారు. ‘కోడలు లేదా కుటుంబసభ్యులెవరైనా అత్తని శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఆమె బాధితురాలిగా మారుతుంది. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ 2005 సెక్షన్ 12 ప్రకారం అత్త కోడలిపై కేసు పెట్టొచ్చు’ అని స్పష్టం చేశారు..

previous post