Tv424x7
National

ఎలాన్ మాస్క్ తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో మాట్లాడారు. టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాలలో సహకారం గురించి చర్చించారు. దీనికి సంబంధించి పీఎం మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. “ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్ డిసిలో జరిగిన మా సమావేశంలో చర్చించిన అంశాలతో సహా వివిధ సమస్యలు, అంశాల గురించి ఎలాన్ మస్క్‌తో మాట్లాడాను. టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ రంగాలలో సహకారానికి ఉన్న అపారమైన అవకాశాలపై మేము చర్చించాం” అని మస్క్ యాజమాన్యంలోనే ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పీఎం మోదీ పోస్ట్‌ చేశారు. టెక్నాలజీలో అమెరికాతో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని మోడీ అన్నారు.

Related posts

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేతగువహటి

TV4-24X7 News

ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్.. ఎందుకంటే..

TV4-24X7 News

మోదీ నూతన సంవత్సర కానుక… పెట్రోల్ ధరలు తగ్గనున్నాయ్.

TV4-24X7 News

Leave a Comment