Tv424x7
Andhrapradesh

గంజాయి కేసులలో ఇద్ధరు నిందితులను అరెస్ట్

విజయవాడ : గంజాయి కేసులలో ఇద్ధరు నిందితులను అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా& ఆర్డర్ బృందాలు.చోరీ చేసిన మోటార్ సైకిల్స్ అమ్మి వచ్చిన డబ్బులతో గంజాయి కొనుగోలు చేస్తున్న నింధితులు

నిందితుల వద్ద నుండి సుమారు 60 వేల రూపాయల విలువైన 9.5 కేజీల గంజాయి మరియు చోరీ చేసిన 03 మోటార్ సైకిల్స్ స్వాదీనం.ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డి.జి.పి. హరీష్ గుప్తా అదేశాల మేరకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో పోలీస్ కమీషనరేట్ పరిదిలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా & ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు గతంలో పలు అక్రమ మాదకద్రవ్యాల కేసులలో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో ఈ రోజు సిటి టాస్క్ ఫోర్సు మరియు లా& ఆర్డర్ బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు సూర్యరావు పేట పోలీస్ స్టేషన్ పరిదిలోని గులాభితోట ఏరియాలో అనుమానంగా తిరుగుతున్న ఇద్ధరు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 60 వేల రూపాయల విలువైన 9.5 కేజీల గంజాయిని మరియు చోరీ చేసిన మూడు మోటార్ సైకిల్స్ లను స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.

నిందితుల వివరాలు:1.విజయవాడ గులాబీతోట ఏరియాకు చెందిన అనపర్తి మనోజ్ పార్ధు (20 సం) 2. పెనమలూరు, వణుకూరు గ్రామానికి చెంధీన షేక్ ఆలీబాబా @ ఆలీ (21 సం.) వీరితోపాటు మరో ముగ్గురు నింధితులు పరారీలో ఉన్నారు. వీరందరూ వేరు వేరు మార్గాల ద్వారా గంజాయికి అలవాటు పడి, సోషల్ మీడియా ప్లాట్ ఫాం ద్వారా పరిచయమై సులభంగా డబ్బులు సంపాదించడానికి వివిధ ప్రాంతాలలో పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్స్ లను దొంగిలించి వాటిపై ఒరిస్సా బోర్డర్ కు వెళ్ళి అక్కడ ఈ వాహనాలను అమ్మి వచ్చిన డబ్బులతో అక్కడ గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాలలోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు.

• ప్రజలందరూ మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా గంజాయి సాగు, మత్తుపదార్ధాలను రవాణా, విక్రయించడం మరియు సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ క్రింది తెలిపిన ప్రత్యేక నెంబర్ మరియు Mail.ID ల ద్వారా నార్కోటిక్ సెల్ పోలీస్ వారికి తెలియజేయగలరు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడును.

నెంబర్: 9121162475

Mail.ID: antinarcoticcell@vza.appolice.gov.in

Related posts

పల్నాడు పసుపుమయం.. దారులన్నీ ‘ప్రజాగళం సభ’ వైపే

TV4-24X7 News

వైభవోపేతంగా శ్రీ పట్టాభి రామస్వామి నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవములు…

TV4-24X7 News

విల్లూరి జోన్ 3 కమీషనర్ శివ ప్రసాద్ కి సత్కారం

TV4-24X7 News

Leave a Comment