Tv424x7
Andhrapradesh

వాసుపల్లి చొరవతో వృద్ధురాలికి ఆశ్రయం

39 వ వార్డు అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ సహకారంతో ఆశ్రమంలో చేరిక

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సహకారంతో తన వద్దకు సాయం కోసం వచ్చిన ఓ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించారు. ఆశిలమెట్ట కార్యాలయం సమీపంలో అనాధగా జీవిస్తున్న వృద్ధురాలు పట్టడన్నం కూడా దొరకని స్థితిలో ఉంటూ వాసుపల్లి సహకారం కోరింది. తక్షణమే స్పందించిన వాసుపల్లి గణేష్ కుమార్ 39 వ వార్డు వైసిపి అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ తో వృద్ధురాలిని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థలో ఆశ్రయం కల్పించారు. టు వీలర్ పై స్వయంగా తీసుకువెళ్లి ఆశ్రయం ప్రతినిధులకు అప్పగించారు. దక్షిణ నియోజకవర్గంలో పేదలకే కాకుండా అనాధలకు కూడా అండగా నిలబడే వాసుపల్లి గణేష్ కుమార్ సేవలపట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.

Related posts

18 లక్షలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య

TV4-24X7 News

జూన్ 4 న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం

TV4-24X7 News

విజయవాడలో భారీగా నగదు పట్టివేత

TV4-24X7 News

Leave a Comment