Tv424x7
National

పహల్గాం దాడికి ముందు 22 గంటలపాటు ఉగ్రవాదుల ట్రెక్కింగ్‌..!

పహల్గాం సమీపంలోని బైసరన్‌ లోయలో జరిగిన ఉగ్రదాడి యావత్‌ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన ఈ మారణహోమంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పర్యాటకులను చంపేందుకు టెర్రిరిస్టులు పెద్ద ప్రణాళికే రచించినట్లు తెలుస్తోంది.ఉగ్రవాదులు పహల్గాంకు చేరుకునేందుకు దాదాపు 22 గంటలపాటు ట్రెక్కింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తమ ప్రణాళికను అమలుచేసేందుకు టెర్రరిస్టులు కోకెర్నాగ్‌ అడవుల నుంచి బైసరన్‌ లోయ వరకు కాలినడకన వచ్చినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఉగ్రవాదులు స్థానికుడి నుంచి ఒకటి, పర్యాటకుడి నుంచి మరొకటి మొబైల్‌ ఫోన్లు దొంగలించినట్లు తేలింది.ఈ మారణహోమంలో మొత్తం నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. వారిలో ముగ్గురు విదేశీయులు కాగా, మరొకడు స్థానిక ఉగ్రవాది ఆదిల్‌ థోకర్‌గా గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అనంత్‌నాగ్‌ జిల్లాలోని బిజ్‌బెహారాకు సమీపంలోని గురీ అనే చిన్న గ్రామానికి చెందిన ఆదిల్‌.. టీనేజ్‌లో ఉండగానే పలు నిషేధిత ఉగ్ర సంస్థలకు అనుగుణంగా పనిచేశాడు. 2018లో దక్షిణ కశ్మీర్‌లో ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో పాల్గొన్నాడు.అదే ఏడాది పాకిస్థాన్‌ నుంచి విద్యార్థి వీసా సాధించి వాఘా సరిహద్దు దాటాడు. అలా వెళ్లిన అతడు ఉగ్రవాదిగా శిక్షణ పొంది, తిరిగివచ్చి సొంతగడ్డపైనే అకృత్యాలకు పాల్పడ్డాడు. తాజాగా విదేశీ ఉగ్రవాదులతో కలిసి సొంతగడ్డపై 26 మంది పర్యాటల హత్యలకు కారకుడయ్యాడు..

Related posts

నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ

TV4-24X7 News

చైనా, రష్యా, భారత్ కలిస్తే అమెరికా పరిస్థితేంటి ?

TV4-24X7 News

చెవికి బ్యాండేజీలతో సపోర్ట్..

TV4-24X7 News

Leave a Comment