Tv424x7
AndhrapradeshCinima News

పుష్ప నటుడు జగదీశ్ ను అరెస్ట్

పుష్ప’లో అల్లు అర్జున్‌ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్‌ (కేశవ)పై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ జూనియర్‌ అర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన జగదీశ్‌ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. జగదీశ్‌ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ (జూనియర్‌ అర్టిస్టు) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.🟦మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్‌ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశ్‌ను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.

Related posts

ఏపీలో చంద్రబాబు కొత్త పథకం..లబ్ధిదారులకు రూ.లక్ష..

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ కి 5,655.72 కోట్లరూపాయల ను మంజూరు చేసిన కేంద్రం

TV4-24X7 News

కడపకు రాబోతున్నా మాజీ సీఎం చంద్రబాబునాయుడు

TV4-24X7 News

Leave a Comment