బెంగళూరుకు చెందిన దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్.. ఎప్పుడూ లేనివిధంగా లేఆఫ్స్‌కు తెర తీసింది. వరుసబెట్టి ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది.ప్రత్యేకించి- ట్రైనీలపై దృష్టి పెట్టిందా సంస్థ యాజమాన్యం. ట్రైనింగ్ అసెస్‌మెంట్ టెస్టులను నిర్వహించి మరీ వాళ్లకు మంగళం పాడుతోంది.అసెస్‌మెంట్ టెస్టులను నిర్వహించిన తర్వాత ఇది నాలుగో రౌండ్ లేఆఫ్ కావడం చర్చనీయాంశమౌతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు 800 మంది ట్రైనీలను సాగనంపిందా సంస్థ యాజమాన్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అంటే ఈ నెలలోనే ఇప్పటివరకు 240 మంది ట్రైనీలను తొలగించిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.కిందటి నెలలోనూ లేఆఫ్స్ కొనసాగాయి. ఆ ఒక్క నెలలోనే దాదాపు 300 మంది ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు వాళ్లందరికీ ఇమెయిల్స్ పంపిస్తోంది. తొలగింపునకు గురైన ట్రైనీలుజెనరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో సంస్థ అంచనాలను అందుకోలేకపోయారని ఇన్ఫోసిస్ వివరణ ఇస్తోంది.మూడు దశలు- డౌట్ క్లియరింగ్ సెషన్స్, అడిషనల్ ప్రిపరేషన్ టైమ్, వివిధ రకాల మాక్ అసెస్‌మెంట్ టెస్ట్‌లల్లో వాళ్లు తమ అంచనాలకు అనుగుణంగా రాణించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఇప్పటివరకు వేటు పడిన మొత్తం ఉద్యోగుల్లో 250 మంది అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లలో చేరినట్లు మనీకంట్రోల్ వెల్లడించింది.అలాగే మరో 150 మంది అవుట్ ప్లేస్‌మెంట్ సర్వీసుల కోసం తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు పేర్కొంది. లేఆఫ్ ఇమెయిల్ అందుకున్న ప్రతి ట్రైనీకీ ఒక నెల జీతం, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ సెక్టార్‌లో అప్‌గ్రేడ్ సంస్థ ద్వారా 12 వారాల శిక్షణ ఇప్పిస్తామని తెలిపింది.అలాగే- ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవడానికి ఎన్ఐఐటీ మరో 24 వారాల పాటు ట్రైనింగ్ ఇప్పించనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. దీనికోసం అప్‌గ్రేడ్, ఎన్ఐఐటీతో ప్రత్యేకంగా ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

next post