..అమరావతి..టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు రెడీ అవుతున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు..ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో ఆయన పర్యటించబోతున్నారు. రేపు పొన్నూరు, వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్లబోతున్నారు. రేపు రాత్రికి బాపట్లలోనే టీడీపీ అధినేత బస చేయనున్నారు. శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకోనున్నారు..

previous post