Tv424x7
Telangana

బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వాక్యాలు

బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని స్పష్టం చేశారు. కేటీఆర్‌ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తాను అని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తాను, ఆయన ఆదేశాలను పాటిస్తానని అన్నారు. రాముడికి హనుమంతుడిలాగా.. కేసీఆర్‌కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను.. కేసీఆర్ మాటే.. హరీష్ బాట.. ఎట్టి పరిస్థితుల్లో గీత దాటేది లేదని అని వెల్లడించారు.అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని అన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయామని గ్రహించిన ప్రజలంతా.. కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

ఈ వారం గజగజ: టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం..!!

TV4-24X7 News

కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్..

TV4-24X7 News

బిఎస్ఎన్ఎల్ పూర్వ వైభవం రానుందా..? ఆ రాష్ట్రంలో రెండు వారాల్లో లక్షకు పైగా కస్టమర్లు…

TV4-24X7 News

Leave a Comment